ప్రభుత్వ అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తాం

Somu Veerraju Fires On Corruption In TDP Govt Schemes - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన పథకాల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీరు-చెట్టు, హౌసింగ్‌లో జరిగిన అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామన్నారు. చంద్రబాబు పులి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టే.. కేవలం హౌసింగ్‌లోనే 30 కోట్ల దోపిడి జరిగిందని ఆరోపించారు. మరో పదిలక్షల ఇళ్లు మంజూరు చేస్తే లక్ష కోట్ల కుంభకోణం జరిగేదని వ్యాఖ్యానించారు. మరో సంపూర్ణ విప్లవం రావాలని.. లేదంటే చంద్రబాబుతో ప్రమాదమని తెలిపారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ను కచ్చితంగా ఏర్పాటు చేస్తామన్నారు. కానీ రాష్ట్ర  ప్రభుత్వం సహకరించడం లేదన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top