బీజేపీ ఎమ్మెల్యేకు షోకాజ్‌

Show Cause notice to BJP MLA Pranav Champion - Sakshi

డెహ్రాడూన్‌ : పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్‌ ఎమ్మెల్యేకు బీజేపీ షోకాజు నోటీసులు జారీ చేసింది. ఖాన్‌పూర్‌ ఎమ్మెల్యే అయిన ప్రణవ్‌ సింగ్‌ ‘ఛాంపియన్‌’(పహిల్వాన్‌ కావటంతో అలా పిలుస్తారు) తమ ప్రభుత్వం అవినీతిని అరికట్టడంలో విఫలమవుతుందంటూ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యలు చేయటంతో కలకలం రేగింది. 

ముఖ్యంగా ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రణవ్‌ తీవ్ర విమర్శలు చేశారు.‘రావత్‌ ప్రభుత్వం అవినీతి పరులకు రక్షణగా నిలుస్తుందని.. అవినీతి వ్యతిరేక పోరాట వాగ్ధానాన్ని తుంగలో తొక్కేసింది’ అని వ్యాఖ్యనించారు. ఆ వీడియో క్లిప్‌ వైరల్‌కాగా,, అధిష్ఠానం సీరియస్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ నోటీసులు జారీ అయ్యాయి.

వ్యాఖ్యలపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఉత్తరాఖండ్‌ యూపీ విభాగం ఆయన్ని ఆదేశించింది.  ఆయన వివరణ సహేతుకంగా లేకపోతే క్రమశిక్షణ చర్యల కింద వేటు పడే అవకాశం ఉంది.


                                                          ఎమ్మెల్యే ప్రణవ్‌ సింగ్‌ (ఫైల్‌ ఫోటో)

విమర్శలకు కారణం.. 
హరిద్వార్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న అవినీతిపై ప్రణవ్‌ కొన్నాళ్ల క్రితం ముఖ్యమంత్రి  త్రివేంద్ర సింగ్‌ రావత్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పభుత్వం ఓ విచారణ కమిటీని నియమించింది. అయితే ఆ కమిటీలో కూడా ఓ అవినీతి పరుడైన అధికారి ఉన్నాడని.. తక్షణమే ఆయన్ని తొలగించాలని సీఎంకు ప్రణవ్‌ విజ్ఞప్తి చేశాడు. కానీ, రావత్‌ మాత్రం ఆ అంశాన్ని పెడచెవిన పెట్టాడు. దీంతో ఏకంగా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాను కలిసి జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రణవ్‌ కోరారు. ఆ వ్యవహారం ఇంకా తేలకముందే ఇప్పుడు ప్రజా సమావేశంలో ఆయన పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం కలకలం రేపింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top