సీఎంగారూ.. మీ ఎమ్మెల్యే డాన్స్‌ చూశారా? | RJD posted JD(U) MLA dancing video | Sakshi
Sakshi News home page

సీఎంగారూ.. మీ ఎమ్మెల్యే డాన్స్‌ చూశారా?

Oct 12 2017 1:15 PM | Updated on Oct 12 2017 3:36 PM

MLA_Dance

పట్నా: రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) అధికారిక ట్విటర్‌ పేజీలో పోస్ట్‌ చేసిన వీడియో బిహార్‌ రాజకీయాల్లో కలకలం రేపింది.  జేడీ(యూ) ఎమ్మెల్యే డాన్స్‌ చేసిన చూడంటూ ఆర్జేడీ ఒక వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘మీ ఎమ్మెల్యే ఎలా డాన్స్‌ చేస్తున్నాడో చూడండి’ అంటూ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను ఉద్దేశించి పేర్కొంది. ఒక బహిరంగ కార్యక్రమంలో జేడీ(యూ) ఎమ్మెల్యే అభయ్‌ కుమార్‌ సిన్హాలా కనిపిస్తున్న వ్యక్తి కురచ దుస్తుల భామతో ఉత్సాహంగా డాన్స్‌ చేస్తున్నట్టు వీడియోలో ఉంది. అంతేకాదు సదరు మహిళను ఎమ్మెల్యే అభ్యంతరకరంగా తాకుతూ కనిపించారు. అయితే ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారనే వివరాలను ఆర్జేడీ వెల్లడించలేదు. వీడియోలో ఉన్నది అభయ్‌ కుమార్‌ అవునో, కాదో స్పష్టం కాలేదు. గయ జిల్లాలోని టికారి నియోజకవర్గానికి అభయ్‌ కుమార్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మహాకూటమి నుంచి బయటకు వెళ్లిపోయి తనదారి తను చూసుకోవడంతో జేడీ(యూ), ఆర్జేడీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. లాలూ తనయుడు తేజశ్వి యాదవ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో మహాకూటమితో బంధాన్ని నితీశ్‌ తెంచుకున్నారు. తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో చేతులు కలిపారు. ఆత్మప్రబోధానుసారమే మహాకూటమి నుంచి బయటకు వచ్చానని నితీశ్‌ అప్పట్లో చెప్పారు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ జేడీ(యూ) ఎమ్మెల్యే డాన్స్‌ వీడియోను ఆర్జేడీ ట్విటర్‌లో పెట్టింది. దీనిపై సీఎం నితీశ్‌ ఎలా స్పందింస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement