కాంగ్రెస్‌లో చేరిక.. నోరు మెదపని రేవంత్! | Revanth Reddy did not react on joing in congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరిక.. నోరు మెదపని రేవంత్!

Oct 18 2017 2:42 AM | Updated on Mar 18 2019 9:02 PM

Revanth Reddy did not react on joing in congress party - Sakshi

హైదరాబాద్ :  టీడీపీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లి సంప్రదింపులు జరిపారని విస్తృత ప్రచారం జరిగింది. మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారని, రేవంత్‌తో పాటు మరో ఎమ్మెల్యే, 20 మందికిపైగా నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. అయితే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరిపిన రేవంత్ రెడ్డి రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై మీడియా ప్రతినిధులు రేవంత్‌ను ప్రశ్నించగా.. ఏ విధంగానూ స్పందించకుండా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఆయన వెళ్లిపోయారు. దీంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ఒకవేళ రేవంత్ కాంగ్రెస్‌లో చేరడం నిజమైతే.. టీటీడీపీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరితే ఆయనతో పాటు పాటు మరో ఎమ్మెల్యే, 20 మంది నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నవంబర్‌ రెండో వారంలో తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో.. ఆ నెల 9న గానీ లేదా 12న గానీ వరంగల్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభలోనే రేవంత్‌రెడ్డి, ఇతర టీటీడీపీ నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement