
సాక్షి, చెన్నై : రాజకీయ ఆరంగ్రేటం గురించి ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ క్షేత్ర స్థాయి పనులను ప్రారంభించేశాడు. వెబ్ సైట్, యాప్‌ను లాంఛ్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఆహ్వానం కూడా పంపాడు.
ఈ మేరకు రజనీమండ్రమ్.ఓఆర్‌జీ పేరుతో ఓ వెబ్ సైట్‌ను ప్రారంభించి అందులో రజనీ ప్రసంగం వీడియోను ఉంచారు. తన రాజకీయ ప్రవేశాన్ని స్వాగతించిన అభిమానులను ఆయన ధన్యవాదాలు తెలిపారు. మంచి మార్పు కోసం ఫ్యాన్స్, తమిళ ప్రజలు ఏకతాటిపైకి రావాలని. పార్టీలో వాలంటరీలుగా చేరాలని ఆయన పిలుపునిచ్చాడు. రజనీ మండ్రమ్ పేరుతోనే యాప్‌ను కూడా లాంఛ్ చేశారు. అన్నీ బాగానే ఉన్నా పార్టీ పేరును ప్రకటించకుండానే ఈ హడావుడి చేస్తుండటం కొసమెరుపు.
కాగా, సుమంత్ రామన్ అనే రాజకీయ విశ్లేషకుడు రజనీ పొలిటికల్ ఎంట్రీని స్వాగతిస్తూ.. అవసరమైతే రజనీకి సలహాలు ఇస్తానని ముందుకు రావటం విశేషం.