రూపాయి విలువను మోదీ తల్లి వయస్సుతో పోల్చిన నేత..

Raj Babbar Compares Rupee Value To Modi Mothers Age - Sakshi

భోపాల్‌ :  రోజు రోజుకూ పడిపోతున్న రూపాయి విలువను మోదీ తల్లి వయసుతో పోల్చుతూ వివాదానికి తెరలేపారు కాంగ్రెస్‌ నాయకుడు రాజ్‌ బబ్బర్‌ . మధ్యప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో భాగంగా ఇండోర్‌లో రాజ్‌ బబ్బర్‌ మాట్లాడుతూ.. ‘మోదీ పడిపోతున్న రూపాయి విలువను.. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వయసుతో పోల్చారు. కానీ ఈ రోజు రూపాయి విలువ చాలా దారుణంగా పడిపోయింది. అది  ఎంత తగ్గిందంటే మోదీ అమ్మగారి వయసంత’ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా రాజ్‌ బబ్బర్‌ ఆయోధ్య రామ మందిర నిర్మాణం గురించి కూడా మాట్లాడారు. ‘ఆలయ నిర్మాణానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఇప్పుడు ముస్లింలు కూడా రామ మందిర నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారు. బీజేపీ ఆలయాన్ని నిర్మిస్తానంటుంది కానీ ఎప్పుడనేది చెప్పడం లేదంటూ ఆరోపించారు. అయితే రాజ్‌ బబ్బర్‌ మాటలపై బీజేపీ మండి పడుతుంది. కాంగ్రెస్‌ పార్టీది ఎంతటి నీచమైన మనస్తత్వవమో బబ్బర్‌ మాటలను బట్టి అర్థమవుతోంది. ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం వల్ల కాంగ్రెస్‌ పార్టీ విలువ పూర్తిగా పడిపోతుంది. ఈ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాము. రాజ్‌ బబ్బర్‌ తక్షణమే క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ పార్టీ డిమాండ్‌ చేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top