
సాక్షి, అనంతపురం : ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన 31వ రోజుకి చేరుకుంది. ఆదివారం ఉదయం శింగమనల నియోజకవర్గం మార్తాడ్ నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు.
కోటంక గ్రామం మీదుగా ఉరవకొండ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. కోడేరు మండలం కమ్మూరుకు జగన్ చేరుకుంటారు. మధ్యాహ్నం భోజన విరామం ఉంటుంది. తిరిగి అక్కడి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది.
ఆపై అరవకూరు మీదుగా కూడేరు గ్రామానికి చేరుకుంటారు. సాయంత్రం కూడేరుకి చేరుకోగానే పాదయాత్ర ముగిస్తారు. మొత్తం పాదయాత్రలో ఆయన ఇప్పటిదాకా 422.9 కిలోమీటర్లు నడిచిన విషయం తెలిసిందే. కూడేరులో రాత్రి 7 గంటలకు వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ సమావేశంలో వ్యవహరించాల్సిన తీరుపై ఆయన ఎంపీలతో చర్చించనున్నారు.