
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 37వ రోజు ముగిసింది. పాదయాత్ర నేడు అనంతపురం జిల్లాలో తుమ్మల, తిప్పెపల్లి క్రాస్, రావుల చెరువు ఎస్సీ కాలని మీదుగా యర్రగుంటపల్లి తండా క్రాస్, రావులచెరువు తండా వెంకట తిమ్మాపురం వరకు కొనసాగి దర్శినమలలో ముగిసింది. అడుగడుగునా వైఎస్ జగన్‌కు ప్రజలు నీరాజనం పలికారు. ఇవాళ 15.6 కిలో మీటర్ల నడిచిన వైఎస్ జగన్ ఇప్పటి వరకు మొత్తం 519 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.