ప్రజాసంకల్పయాత్ర 37వ రోజు | YS Jagan PrajaSankalpaYatra 37th Day | Sakshi
Sakshi News home page

Dec 17 2017 9:00 AM | Updated on Jul 25 2018 4:09 PM

YS Jagan PrajaSankalpaYatra 37th Day - Sakshi

సాక్షి, అనంతపురం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర 37వ రోజుకి చేరుకుంది. ఈ ఉదయం అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం అయ్యింది. భారీ జన సందోహం నడుమ కాసేపటి క్రితం వైఎస్ జగన్‌ పాదయాత్ర చేపట్టారు.

తుమ్మల, తిప్పేపల్లి క్రాస్, రావులచెరువు ఎస్సీ కాలనీలో మీదుగా ప్రజాసంకల్పయాత్ర సాగనుంది. ముందుగా రావులచెరువు గ్రామంలో వైఎస్‌ జగన్‌ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం యాత్ర కొనసాగిస్తూ ఎర్రగుంటపల్లి తండా క్రాస్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి రావులచెరువు తండా, వెంకటతిమ్మాపురంల మీదుగా దర్శినమలకు చేరుకుని పాదయాత్రను ముగిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 

ఇక దారిపోడవునా ఆయన జనంతో మమేకం కానున్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలను, చంద్రబాబు ‘అవినీతి’  పాలనలో వారు ఎదుర్కుంటున్న ఇబ్బందులను వైఎస్‌ జగన్‌ వింటారు. కాగా, ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ ఇప్పటిదాకా మొత్తం 503.4 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement