సర్వే : పురపోరులో కారు హవా..!

Peoples Pulse Survey Projects TRS Grand Victory In Municipal Polls - Sakshi

హైదరాబాద్‌ : తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ విజయ దుందుభి మోగిస్తుందని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్‌ కేం‍ద్రంగా పనిచేస్తున్న పీపుల్స్‌ పల్స్‌ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్‌ సర్వే కూడా ఇదే అంశం స్పష్టం చేసింది. జనవరి 17 నుంచి 19 వరకు 20 శాతం మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్ల పరిధిలో ప్రీ పోల్‌ సర్వేను చేపట్టినట్టు ఆ సంస్థ తెలిపింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధిస్తారని పేర్కొంది.  

పార్టీలు విజయం సాధించే స్థానాలు(ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 3 శాతం)

పార్టీ వార్డులు (మున్సిపాలిటీలు)   డివిజన్‌లు(కార్పొరేషన్లు)
టీఆర్‌ఎస్‌ 1950-2000 180-205
కాంగ్రెస్‌ 375-415 40-60
బీజేపీ 150-180 60-75
ఎంఐఎం 25-30 8-10

అలాగే కార్పొరేషన్లలో టీఆర్‌ఎస్‌కు 49.1 శాతం, కాంగ్రెస్‌కు 21 శాతం, బీజేపీకి 23.8 శాతం, ఎంఐఎంకు 3.3 శాతం ఓట్లు వస్తాయని ఆ సంస్థ అంచనా వేసింది. అలాగే 120 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌కు 52.3 శాతం, కాంగ్రెస్‌కు 23.3 శాతం, బీజేపీకి 16.1 శాతం, ఎంఐఎంకు 1.6 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. కార్పొరేషన్లలో, మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ స్పష్టమైన అధిక్యం కనబరుస్తుందని వెల్లడించింది. టీఆర్‌ఎస్‌తో పొల్చితే బీజేపీ, కాంగ్రెస్‌లు చాలా తక్కువ స్థానాల్లో విజయం సాధిస్తాయని పేర్కొంది. అలాగే కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ కన్న బీజేపీ ఎక్కువ డివిజన్‌లను, అలాగే మున్సిపాలిటీల్లో బీజేపీ కన్న కాంగ్రెస్‌ ఎక్కువ వార్డులను కైవసం చేసుకుంటుందని ఆ సంస్థ చెప్పింది.

కార్పొరేషన్లలో ఓట్ల శాతం..

రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం ఎన్నికలు జరగగా మొత్తం 70.26 శాతం పోలింగ్‌ నమోదైంది. మరోవైపు పలు కారణాల వల్ల కరీంనగర్‌ కార్పొరేషన్‌కు మాత్రం శుక్రవారం పోలింగ్‌ జరుగుతోంది. అలాగే కామారెడ్డి, భోదన్‌, మహబూబ్‌నగర్‌లలోని ఒక్కో కేంద్రంలో నేడు అధికారులు రీపోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

మున్సిపాలిటీల్లో ఓట్ల శాతం..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top