మా వేతనాలు వదులుకోబోం: శివసేన

NDA MPs to give up salary for disrupted part of budget session - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ మలివిడత సమావేశాలు కొనసాగని కారణంగా.. 23 రోజుల వేతనాన్ని వదులుకుంటున్నామన్న బీజేపీ నిర్ణయంపై ఎన్డీయే పక్షాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ వేతనాలు వదులుకోబోవటం లేదని శివసేన స్పష్టం చేసింది. వేతనాల విషయంలో తమను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని మండిపడింది.

పార్లమెంటు నిరసనలతో వాయిదా పడేందుకు ప్రభుత్వం తీరే కారణమని శివసేన విమర్శించింది. అటు ఆర్‌ఎల్‌ఎస్‌పీ చీఫ్, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ కూడా వేతనాల విషయం తమకు తెలియదన్నారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా బీజేపీ నాయకత్వం నిర్ణయంపై విభేదించారు.  కాగా, మొత్తం 400 మంది ఎన్డీయే ఎంపీ (ఉభయసభలు)ల 23 రోజుల వేతనం రూ.3.66 కోట్లను వదులుకోనున్నట్లు గురువారం కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ వెల్లడించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top