‘కౌగిలింత అంతే.. రాఫెల్‌ డీల్‌ కాదు కదా’ | Navjot Singh Sidhu Said It Was Just A Hug Not A Rafale Deal | Sakshi
Sakshi News home page

Nov 27 2018 8:32 PM | Updated on Nov 27 2018 8:32 PM

Navjot Singh Sidhu Said It Was Just A Hug Not A Rafale Deal - Sakshi

న్యూఢిల్లీ : పంజాబ్‌ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కౌగిలింత అనేది కేవలం ఒక్క సెకన్‌ మూవ్‌మెంట్‌ అంతే.. అదేమీ రాఫెల్‌ డీల్‌ అంతా ప్రమాదకరం కాదంటూ బీజేపీకి చురకలంటించారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి హాజరైన సిద్ధూ ఈ సందర్భంగా తాను గతంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకోవడాన్ని మరోసారి సమర్ధించుకున్నారు. ఈ విషయం గురించి సిద్ధూ మాట్లాడుతూ.. ‘ఎప్పుడైనా ఇద్దరు పంజాబీలు ఎదురుపడితే కౌగిలించుకుంటారు.. పంజాబ్‌లో ఇది చాలా సర్వ సాధారణం. ఇది కేవలం ఒక్క సెకన్‌ మూవ్‌మెంట్‌ అంతే.. రాఫెల్‌ డీల్‌ అంతా ప్రమాదకరం కూడా కాదం’టూ బీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు.

అంతేకాక ఈ కర్తార్‌పూర్‌ కారిడార్‌ నిర్మాణం ఇరు దేశాల ప్రజలను దగ్గర చేసి, శాంతిని పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. భారత్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లా డేరా బాబా నానక్‌ నుంచి కర్తార్‌పూర్‌ నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలోనే రహదారి నిర్మించేందుకు వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement