అనైతిక పొత్తులకు టీడీపీ కేరాఫ్‌ అడ్రస్‌ : కవిత

MP Kavitha Says TDP Plan To Alliance With Congress In AP - Sakshi

ఏపీలో పొత్తు కోసమే తెలంగాణలో హస్తంతో ముందస్తు పొత్తు

కాంగ్రెస్‌ నేతలపై ఉన్నవి పాత కేసులే : ఎంపీ కవిత

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కోసమే ముందస్తుగా తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ జత కడుతోందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. అనైతిక పొత్తులకు టీడీపీ కేరాఫ్‌ అడ్రస్‌ అని ఎద్దెవా చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతలపై ఉన్న కేసులు పాతవని, వాటితో మాకు ఎలాంటి సంబంధంలేదని ఆమె తేల్చిచెప్పారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సెంచరీ కొడతామని ధీమా వ్యక్తం చేశారు.

అసెంబ్లీ టికెట్ల విషయంలో కొన్నిప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయని.. పార్టీ నాయకత్వం వాటిని త్వరలోనే పరిష్కరిస్తుందని వెల్లడించారు. వరంగల్‌ తూర్పు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ భూపతి రెడ్డిలు స్వార్థం కోసం మాపై విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మంగళవారం జగిత్యాల జిల్లాలో  జరిగిన కొండగట్టు ప్రమాదంపై కవిత స్పందిస్తూ.. ఘటనలో  పొరపాట్లు జరిగాయని అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top