కేంద్రం కంటే కర్ణాటకే మేలు..!

Modi MSP Hike, Band Aid To Massive Haemorrhage Says Rahul Gandhi - Sakshi

మద్దతు ధర పెంపు : మోదీపై రాహుల్‌ చురకలు

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేంద్రం మద్దతు ధరల పెంపుపై స్పందించారు. ఎన్డీయే ప్రభుత్వం చర్యలు మార్కెటింగ్‌ వ్యూహాల్ని తలపిస్తున్నాయని చురకలంటించారు. సరుకుల్ని మార్కెట్లో అమ్ముకోవడానికి తయారీదారులు వేసే ఎత్తుగడల మాదిరిగా ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. 120 కోట్ల జనాభా కల్గిన దేశంలో రైతులకు మేలు చేస్తున్నామని చెప్పుకుంటున్న ఎన్డీయే ప్రభుత్వం మద్దతు ధర పేరుతో  కేవలం 15 వేల కోట్ల రూపాయల భారాన్ని భుజాన వేసుకుందని అన్నారు.

34 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసిన కర్ణాటక ప్రభుత్వం కేంద్రం కంటే ఎంతో మేలని ట్విటర్లో శుక్రవారం పేర్కొన్నారు. కానీ, బీజేపీ నాయకులకు కర్ణాటక ప్రభుత్వం చర్య.. ‘స్వల్ప మొత్తంలో రుణాల మాఫీ’గా కనబడుతోందని ఎద్దేవా చేశారు. ఆపరేషన్‌ అవసరమైన గాయానికి చిన్న బ్యాండేజ్‌ వేసినట్టుగా మోదీ ప్రభుత్వం మద్దతు ధర పెంపు ఉందని విమర్శించారు. కర్ణాటకలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వం 34 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్టు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top