
ప్రచారంలో భాగంగా ఆదివారం తుక్కుగూడలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
తుక్కుగూడ/ఆమనగల్లు: ఎంతమంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా రాష్ట్రంలో బీజేపీ గెలుపును ఆపలేరని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మతోన్మాద పార్టీ మజ్లిస్‌తో పొత్తు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుతారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావ డం ఖాయమన్నారు. ఇది బంగారు తెలంగాణ కాదని, కుటుంబ పాలన, మద్యం తెలంగాణ అని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి మంత్రి పదవి దక్కించుకున్న సబిత నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు.
కేసీఆర్‌కు ఓట్లడిగే అర్హత లేదని ఆమనగల్లు రోడ్‌షోలో జి.కిషన్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, అధికారంతో గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్ అమలు చేయలేదని విమర్శించారు. సచివాలయం లేకుండా పాలన సాగిస్తున్నది సీఎం.. కేసీఆర్ ఒక్కరేనన్నారు.