టికెట్లతోనే అయిపోదు.. గెలిచి రావాలి

Kcr on Party candidates - Sakshi

అసంతృప్తులను నిర్లక్ష్యం చేయొద్దని కేసీఆర్‌ సూచన

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ టికెట్లను ఇవ్వగానే పని పూర్తయినట్టు కాదని, ఎన్నికల్లో గెలిచి రావాలని టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. శాసనసభకు 105 మంది అభ్యర్థులను ప్రకటించిన అనంతరం గురువారం సాయంత్రం ఆయన అభ్యర్థులతో సమావేశమై పలు సూచనలు చేశారు. టికెట్లపై గందరగోళం, చివరి క్షణంలో అయోమయం ఉండకూడదనే అభ్యర్థులను ముందుగానే ప్రకటించామన్నారు. అభ్యర్థిత్వంపై అయోమయం అవసరంలేదని, గెలుపు కోసం పనిచేయాలని సూచించారు.

నియోజకవర్గాల్లో అసంతృప్తిగా ఉన్న నాయకులతో సమావేశమై, సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. పూర్తిగా నియోజకవర్గాల్లోనే ఉంటూ, ప్రజలతో కలిసి గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశించారు. పార్టీ అభ్యర్థుల పనితీరు, వ్యవహారశైలిపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తానని, లోపాలు ఉంటే సరిచేసుకోవాలన్నారు. అహంకారం, గర్వం లేకుండా పనిచేసుకోవాలని, ఈ నెల 15లోగా మరోసారి సమావేశం ఉంటుందని చెప్పారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top