దేశ రాజకీయాల్లోకి జాతీయ పార్టీగా వెళ్తా: కేసీఆర్‌

KCR Election Campaign Act Miryalaguda In Nalgonda - Sakshi

సమాఖ్య కూటమితోనే దేశాభివృద్ధి

ఎన్నికల తరువాత బీజేపీకి శంకరగిరిమాన్యాలే

ఉత్తమ్‌, కుంతియా సీట్లు అమ్మకున్నారు

కోమటిరెడ్డి రాజకీయ సన్యాసమని.. ఎందుకు పోటీ చేస్తున్నారు

మిర్యాలగూడ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్‌

సాక్షి, నల్గొండ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు, కాంగ్రెస్‌ పార్టీకి 100 సీట్లు కూడా రావని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందని, ఆ పార్టీలే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని స్పష్టం చేశారు. దేశ భద్రత సంబంధించిన విషయాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారంగా ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసమే హిందూవులంటూ రెచ్చగొడుతున్నారని, ఎన్నికల అనంతరం బీజేపీకి శంకరగిరిమాన్యాలే అని ఎద్దేవా చేశారు. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని కేసీఆర్‌ హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, అందుకే బీజేపీకి 119 స్థానాల్లో పోటీచేస్తే.. కేవలం ఒకేఒక్క స్థానంలో గెలుపొందారని గుర్తుచేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో జరిగిన టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద ఆల్ట్రామెగా విద్యుత్‌ ప్లాంట్‌ను 29వేల కోట్లతో దామరచర్లలో నిర్మిస్తున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గెలిపించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో నల్గొండను మరింత అభివృద్ధి చేస్తామని, దాంతో ఈజిల్లా ముఖచిత్రమే పూర్తిగా మారనుందని స్పష్టం చేశారు. కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈజిల్లాలో టీఆర్‌ఎస్‌ ఒక్కస్థానం గెలిచిన రాజకీయ సన్యాసం చేసుకుంటానని కోమటిరెడ్డి ప్రకటించారని.. మళ్లీ ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు.

ఇన్నేళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ ఏం అభివృద్ధి చేసిందో ఉత్తమ్‌, రాహుల్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. టికెట్లు అమ్ముకునే సంస్కారం కాంగ్రెస్‌ నేతలదని, అందుకే అందరూ రాజీనామాలు చేసి తమ పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు. ఎన్నికల అనంతరం ఉ‍త్తమ్‌ కుమార్‌ రెడ్డి పదవి పోవడం ఖాయమన్నారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం అవసరమైతే జాతీయ పార్టీని కూడా పెడతానని కేసీఆర్‌ ప్రకటించారు. సమాఖ్య కూటమి వస్తేనే దేశంలో మార్పు సాధ్యమన్నారు. లోక్‌సభ ఎన్నిలకల్లో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి నల్గొండ ఎంపీగా పోటీచేస్తున్న వేమిరెడ్డి నర్సింహారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్‌ కోరారు.  
 

మరిన్ని వార్తలు

22-05-2019
May 22, 2019, 01:34 IST
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలపై వచ్చే ఫిర్యాదులపై స్పందించేందుకు 24 గంటలపాటు పనిచేసే కంట్రోల్‌రూమ్‌ను ఎన్నికల సంఘం (ఈసీ)...
22-05-2019
May 22, 2019, 01:20 IST
సాధారణ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది..ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలూ వచ్చేశాయి..ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 11 ఎగ్జిట్‌ పోల్స్‌..! బీజేపీ నేతృత్వంలోని...
21-05-2019
May 21, 2019, 19:11 IST
ఈవీఎంలకు మూడు సీళ్లు ఉంటాయి. ఏజెంట్ల సమక్షంలోనే..
21-05-2019
May 21, 2019, 19:08 IST
ఎన్డీయే మంత్రుల భేటీ..
21-05-2019
May 21, 2019, 19:02 IST
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో టీడీపీకి చుక్కెదురైంది. వీవీప్యాట్ల ముందస్తు లెక్కింపుపై దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. సార్వత్రిక ఎన్నికల...
21-05-2019
May 21, 2019, 18:48 IST
కాకినాడ: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ‘ జూలకటక’ అన్నట్లుగా తయారయ్యాడని అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర బాబు ఎద్దేవా...
21-05-2019
May 21, 2019, 17:59 IST
సాక్షి, న్యూఢిల్లీ : 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ అనుకూల పవనాలు వీచినప్పుడు బీజేపీకి 282...
21-05-2019
May 21, 2019, 17:25 IST
హైదరాబాద్‌: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌ రెడ్డి మరోసారి...
21-05-2019
May 21, 2019, 17:05 IST
ప్రఙ్ఞా సింగ్‌ సహా మరో ఏడుగురికి ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో సరైన...
21-05-2019
May 21, 2019, 16:17 IST
‘ఈవీఎంలతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చాలి’
21-05-2019
May 21, 2019, 16:02 IST
బెంగళూరు : కర్ణాటకలో బీజేపీ 20 లోక్‌సభ స్థానాలు గెలుస్తుందంటూ ఎగ్జిట్ పోల్‌ ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ...
21-05-2019
May 21, 2019, 15:52 IST
ఎన్నికల కోడ్‌కు సంబంధించిన అంశాలపై మైనారిటీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరం లేదని సీఈసీ సునీల్‌ అరోరా అభిప్రాయపడినట్టు...
21-05-2019
May 21, 2019, 15:42 IST
బీజేపీ గెలిచినా..ఓడినా ప్రపంచం నిలిచిపోదు : మెహబూబా ముఫ్తీ
21-05-2019
May 21, 2019, 15:33 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల తర్వాత విపక్షపార్టీలు ఢీలా పడినట్టు కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి...
21-05-2019
May 21, 2019, 15:31 IST
సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో లక్ష శాతం ఓడిపోవడం ఖాయమని...
21-05-2019
May 21, 2019, 15:11 IST
సాక్షి, అమరావతి : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని ఏపీ ప్రధాన...
21-05-2019
May 21, 2019, 15:00 IST
అఖిలేష్‌తో కేజ్రీవాల్‌ సంప్రదింపులు
21-05-2019
May 21, 2019, 14:41 IST
అంటే ఆయన ఉద్దేశం ఏమిటీ? లోక్‌సభ ఎన్నికల్లో గెలవలేకపోతున్నామని ముందుగానే ఓటమిని అంగీకరించడమా?
21-05-2019
May 21, 2019, 14:35 IST
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్లోని కోల్‌కతా ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గంలో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నియోజకవర్గంలోని 200వ పోలింగ్‌...
21-05-2019
May 21, 2019, 14:29 IST
లగడపాటి రాజగోపాల్‌ చేసిన సర్వేపై మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top