చంద్రబాబు, లోకేష్‌లపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి 

Karanam Dharmasri comments on Chandrababu and Lokesh - Sakshi

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ డిమాండ్‌

సాక్షి, విశాఖపట్నం: ఏపీ స్పీకర్‌ స్థానాన్ని అగౌరవపరుస్తూ, అప్రతిష్టపాలు చేసేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈపేపర్‌లో రాసిన రాతలకు సంబంధించి చంద్రబాబు, లోకేష్‌లపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని వైస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ డిమాండ్‌ చేశారు. సోమవారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర బిడ్డ, బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్‌గా ఎన్నికైతే.. ఒక బలహీనవర్గానికి చెందిన వ్యక్తి ఆ కుర్చీలో కూర్చున్నాడన్నా అక్కసుతోనే చంద్రబాబు, లోకేష్‌లు ఇంత నీచానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

అసభ్య పదజాలంతో స్పీకర్‌ను దూషించడం వారి కుల దురహంకారానికి అద్దం పడుతోందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల తలరాతలు మార్చే నిర్ణయాలు తీసుకుంటుండటం వారికి మింగుడు పడటం లేదన్నారు. బీసీలను నీచంగా చూస్తూ.. అవాకులు, చవాకులు పేలితే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడొచి్చన 23 సీట్లు కూడా రావన్నారు.  స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top