అవి 'తానాసభలు' కాదు.. వారి ‘భజనసభలు’

Kanna Laxminarayana Slams TDP Leaders Overaction At TANA Celebrations - Sakshi

బురద రాజకీయాల్లోంచే కమలం విరబూస్తుంది : కన్నా

సాక్షి, అమరావతి : అమెరికాలో జరుగుతున్న తెలుగు అసోషియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) సభలను టీడీపీ నేతలు భ్రష్టుపట్టిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. తానా సభల్లో బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ జాతీయవాద ప్రసంగానికి అడ్డుతగిలి అవమానించిన లోకేష్ గ్యాంగ్ మరోసారి తమ నీచబుద్ది బయటపెట్టారని అన్నారు. ఈ సభలను పచ్చతమ్ముళ్లు టీడీపీ భజన సభలుగా మార్చి అమెరికాలో కూడా తెలుగువాళ్ల ప్రతిష్ట దిగజారుస్తున్నారని మండిపడ్డారు. ఈమేరకు ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘ఏపీలో మీ బురద రాజకీయాల్లో నుండే కమలవికాసం జరుగుతుంది’అని కన్నా వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top