నామినేషన్‌ ఉపసంహరించుకున్న జనసేన అభ్యర్థి

Janasena Party Rebel Candidate Withdraw Nomination In Narsipatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : టీడీపీ, జనసేన వేర్వేరు కాదని.. ఆ రెండు పార్టీలు ఒకే లక్ష్యంతో పని చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణలను నిజం చేసే సంఘటన ఒకటి ఈ రోజు చోటు చేసుకుంది. నర్సీపట్నం జనసేన రెబల్‌ అభ్యర్థి బైపీ రెడ్డి అశోక్‌ గురువారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అశోక్‌ బరిలో ఉంటే టీడీపీ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. అందుకే ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారని సమాచారం. మరోవైపు జనసేన అభ్యర్థి వేగి దివాకర్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top