పూజారీ... నేను బాగున్నా ఏడవకు

Janardhana Poojary  prays for rumours of Oscar Fernandes health - Sakshi

సాక్షి, బెంగళూరు: కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జనార్ధన్ పూజారి భోరున విలపించారు. మంగళూరులో చర్చి, దేవాలయంలో ఆయన నిన్న కన్నీళ్లు పెట్టుకున్నారు.  కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ మొదట గోకర్ణనాథేశ్వర స్వామి ఆలయంలో జనార్థన పూజారి పూజలు చేసి విలపించారు. తర్వాత రోసారియో చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తుండగా అక్కడకు ఆస్కార్‌ఫెర్నాండేజ్‌ వచ్చారు. ఈ సందర్భంగా పూజారిని గట్టిగా హత్తుకుని, తనకు ఏమీ కాలేదని ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఫెర్నాండేజ్‌ చెప్పారు. అయితే ఈ తతంగం అంతా అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top