
నల్లగొండ రూరల్: తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా పేరుతో తెలంగాణను మరో సారి అన్యాయానికి గురి చేయవద్ద న్నారు. విభజన చట్టం హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ నేతలు అడగడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీర్మానం చేస్తే, తెలంగాణకు కూడా ఇవ్వాలని ఇక్కడి కాంగ్రెస్ నేతలు అడగకపోవ డం వారి అసమర్థతకు నిదర్శనమన్నారు.