న్యాయం చేయకుంటే రెబల్‌గా పోటీ

I Will Contest As Rebel If not Do justice To Me Said By EX TRS MLA Kaveti Sammaiah - Sakshi

మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య

కాగజ్‌నగర్‌(కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా): సిర్పూర్‌ నియోజకవర్గంలో అధికంగా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఉద్యమ సమయంలో పార్టీలో పనిచేసి రెండుసార్లు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలి పొందానని, తెలంగాణ కోసం సైతం ఒకసారి రాజీనామా చేశానని అలాంటి తనకు టికెట్‌ ఇవ్వకుండా టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ అన్యాయం చేసిందని టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014లో టీఆర్‌ఎస్‌ 63 స్థానాలు గెలుచుకొని అధికా రం చేపట్టినా ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారని వేరే పార్టీతో గెలిచిన ఆంధ్ర వ్యక్తిని తీసుకున్నారని, అప్పుడు పార్టీకి అవసరమేనని తానుకూడా ఓడిపోయానని ఊరుకున్నానన్నా రు.

ఐదేళ్లుగా పార్టీ హైకమాండ్‌ను కలిసిన ప్రతిసారి తనకు న్యాయం చేయాలని కోరుతూ వచ్చానని, తప్పకుండ న్యా యం చేస్తామని హైకమాండ్‌ హామీ ఇచ్చి ఇప్పుడు తనను కాదని టికెట్‌ వేరే వ్యక్తికి ఇవ్వడం బాధాకరమన్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న నియోపజకవర్గంలో బీసీని కాదని బీసీలను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే నాపై అధి ష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చారని నేనేప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్నారు. హైకమాండ్‌ పునరాలో చించి బీసీలకు, తెలంగాణ కోసం పోరాడిన వారికి న్యా యం చేయాలన్నారు. ఒక్కరోజు కూడా తెలంగాణ జెండా పట్టని, తెలంగాణ కోసం వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఇప్పుడు పార్టీలో ఉన్నారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనను, కేసీఆర్‌ను విమర్శించిన వ్యక్తికి టికె ట్‌ ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు.

ఆంధ్ర, తెలంగాణ వేరైనా సిర్పూర్‌కు తెలంగాణ రాలేదని, కోట్లు సంపాదించి దౌర్జన్యాలు, అట్రాసిసీ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకమాండ్‌ పునారాలోచించి నిర్ణయం తీసుకోకుంటే రెబల్‌గా బరిలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. అనంతరం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాంటెంకి శ్రీహరి మాట్లాడుతూ దళితుల ఓట్లతో గెలిచి దళితులను అనణదొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉంటారన్నారు. మాజీ మున్సి పల్‌ చైర్‌పర్సన్, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య సతీమ ణి కావేటి సాయిలీల మాట్లాడుతూ ఉద్యమకారులను విస్మరించడం సరైంది కాదన్నారు. అధిష్టానం మరోసారి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తమకు న్యాయం చేయకుంటే బరిలో ఉండి ప్రత్యర్థిని ఓడించి తీరుతామని హెచ్చరించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top