మళ్లీ వస్తా.. పోటీ చేస్తా : సోనియా | I Will Contest If Needed : Sonia Gandhi | Sakshi
Sakshi News home page

మళ్లీ వస్తా.. పోటీ చేస్తా : సోనియా

Mar 9 2018 6:31 PM | Updated on Mar 19 2019 9:15 PM

I Will Contest If Needed : Sonia Gandhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అవసరం అయితే తాను 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. ప్రస్తుతం దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని వాపోయారు. దేశానికి ప్రధానిగా తనకంటే కూడా ప్రధాని మన్మోహన్‌సింగ్‌కే ఎక్కువ అర్హత ఉందని ఆమె పునరుద్ఘాటించారు.

గాంధీ కుటుంబం లేకపోయినా కాంగ్రెస్‌ పార్టీ బతుకుతుందని, తమతో కలిసివచ్చే పార్టీలను కలుపుకొని ముందుకు వెళతామని ఆమె స్పష్టం చేశారు. తన కుమారుడు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ యువతరాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ఇక రాజకీయాల్లో తన కుమార్తె ప్రియాంక గాంధీ రావడం రాకపోవడం తన ఇష్టం అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement