రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉంది

I feel Happy to resign For Special category Status Said By YSRCP MP Vara Prasad  - Sakshi

ఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉందని తిరుపతి వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ వ్యాఖ్యానించారు. ఎంపీగా రాజీనామా చేసినా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం వివిధ శాఖల మంత్రులను కలుస్తున్నానని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కేవలం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము రాజీనామా చేశామని, ఆ విషయం ప్రజలకు తెలుసునని అన్నారు. బీజేపీ, టీడీపీలు ప్రత్యేక హోదా హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నాయని ఆరోపించారు. కేంద్రంపై టీడీపీ ఒత్తిడి తీసుకురాలేదు..అందుకే బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని విమర్శించారు.

లోక్‌సభలో తామే ముందు అవిశ్వాస తీర్మానం పెట్టామని..కానీ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వల్లే రాజీనామా చేశామని తెలిపారు. కేంద్రమంత్రులను, అధికారులనూ తాను కలుస్తున్నానని చెప్పారు. ఓఎన్‌జీసీ అధికారులను కలిసి వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని కోరాను..ఆరోగ్య మంత్రిని కలిసి రూయా ఆసుపత్రికి రూ.50 కోట్లు, స్విమ్స్‌కి రూ.50 కోట్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. మా సమయం వృథా కానివ్వకుండా ప్రత్యేక హోదా కోసం ప్రజలతో కలిసి పోరాడుతున్నామని చెప్పారు.

ఇప్పుడు ఎంపీలం కాకపోయినా నిథుల కోసం మంత్రులు, అధికారులను కలుస్తున్నామని వివరించారు. వైఎస్‌ జగన్‌ వల్లే ప్రత్యేక హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కడప స్టీల్‌ ఫ్లాంట్‌, దుగరాజపట్నం పోర్టు, ఎయిర్‌పోర్టు కావాలంటే..ఒక డైనమిక్‌ లీడర్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు. 

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top