ఫ్లాట్‌ బాధితుల నోటా బాట..

House Flat victims Are Turning Towards Nota In Noida - Sakshi

సాక్షి, సెంట్రల్‌డెస్క్‌ :  సాధారణంగా ఓటర్లు తమకు నచ్చిన పార్టీకి ఓటెయ్యాలని నిర్ణయించుకుంటారు.అయితే, ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌బుద్ధనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో వేల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ‘నోటా’కు ఓటెయ్యాలని నిర్ణయించుకున్నారు. వారంతా నోయిడా ఫ్లాట్‌ కొనుగోలు బాధితులు. నోయిడా, గ్రేటర్‌ నోయిడాల్లో ఫ్లాట్ల కొనుగోలుకు వేల మంది సొమ్ము కట్టారు.

పదేళ్లయినా ఫ్లాట్లు అప్పగించకపోవడం, ఏ రాజకీయ నాయకుడు తమ సమస్యను పట్టించుకోకపోవడంతో ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ ఓటు వేయకూడదని వారు నిర్ణయించుకున్నారు. బాధితులు ఏర్పాటు చేసుకున్న ‘నోయిడా ఎక్స్‌టెన్షన్‌ ఫ్లాట్‌ ఓనర్స్‌ అండ్‌ మెంబర్స్‌ అసోసియేషన్‌ (నెఫోమా) ఆధ్వర్యంలో ‘నో హోం నో వోట్‌’ ప్రచారం చేపట్టారు. ఈ సంఘంలో 20 నుంచి 25 వేల మంది సభ్యులున్నారు. వీరితో సంబంధాలున్న వారు మరో లక్ష మంది ఉన్నారు.

నోయిడా, గ్రేటర్‌ నోయిడా ప్రాంతాలు గౌతమ్‌ బుద్ధనగర్‌ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. గత ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గంలో కొత్తగా 5 లక్షల మంది ఓట్లు నమోదు చేసుకున్నారు. వీరిలో చాలామంది ఫ్లాట్‌ బాధితులున్నారు. రుద్ర ప్రాజెక్ట్స్‌లో వీళ్లు ఫ్లాట్‌లు బుక్‌ చేసుకున్నారు. 2015 నాటికే ఫ్లాట్లు అప్పగిస్తామని చెప్పిన ఆ సంస్థ ఇంత వరకు అప్పగించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయిందని, ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ ప్రభుత్వాలు వచ్చినా తమ కష్టం మాత్రం తీరలేదని నెఫోమా అధ్యక్షుడు అనూఖాన్‌ ఆరోపించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top