‘బాబు అసమర్థతే కారణం’ | Former Mp Varaprasad Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Jul 22 2018 1:11 PM | Updated on Oct 17 2018 6:18 PM

Former Mp Varaprasad Comments On Chandrababu Naidu - Sakshi

సాక్షి, తిరుపతి: ప్రత్యేక హోదాపై పూటకో మాట మార్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. అదివారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో అవిశ్వాసం, తదితర అంశాలపై స్పందిచారు. వైఎస్‌ఆర్‌సీపీ ఒత్తిడి వల్లే పార్లమెంట్‌లో అవిశ్వాసం పెట్టారని, నాలుగేళ్లుగా టీడీపీ డ్రామాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ఇప్పటివరకు 30 దేశాలు తిరిగాడని.. కానీ అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదని ఎద్దేవ చేశారు. బీజేపీతో టీడీపీ లాలూచీ నిజం కాదా? బీజేపీ తప్పులను గతంలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బాబు అసమర్థత వల్లే రాష్ట్రానికి నిధులు రాలేదని ఆరోపించారు. చంద్రబాబు కేవలం కమీషన్ల కక్కుర్తి కోసమే పోలవరం ప్రాజెక్టును చేపట్టారే తప్పా ఎలాంటి మంచి ఉద్దేశంతో కాదని వరప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement