జూన్‌ 6 నుంచి లోక్‌సభ సమావేశాలు

First Session of New Lok Sabha May Start From June 6 - Sakshi

న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ తొలిసమావేశాలు జూన్‌ 6 నుంచి 15 వరకూ జరుగుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ నెల 31న ప్రధాని మోదీ నేతృత్వంలో తొలిసారి సమావేశం కానున్న కేంద్ర కేబినెట్‌ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోనుంది. గురువారం ప్రధానిగా మోదీ, ఇతర కేంద్ర మంత్రుల చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ సమావేశాలు 6 రోజుల పాటు కొనసాగుతాయి. సమావేశాల్లో భాగంగా మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి లోక్‌సభలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top