‘పవార్‌ సాబ్‌తోనే ఉంటా’

Dhananjay Munde Tweeted To Reassure That He Has Not Betrayed His Party - Sakshi

ముంబై : అజిత్‌ పవార్‌తో కలిసి దేవేంద్ర ఫడ్నవీస్‌ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తూ తాను ఎన్సీపీని మోసం చేయలేదని ఆ పార్టీ నేత ధనంజయ్‌ ముండే అన్నారు. ‘ నేను పార్టీ వెంట, పవార్‌ సాబ్‌ వెంటే ఉన్నా..దయచేసి వదంతులు ప్రచారం చేయకండ’ని ఆయన ట్వీట్‌ చేశారు. బీజేపీకి మద్దతిస్తూ అజిత్‌ పవార్‌ చేసిన ప్రకటన కేవలం పార్టీలో గందరగోళం సృష్టించి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపేందుకేనని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించినయ కొద్ది గంటలకే ధనంజయ్‌ ముండే ఈ ట్వీట్‌ చేశారు.

దేవేంద్ర ఫడ్నవీస్‌ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు చొరవ చూపడంలో అజిత్‌ పవార్‌తో కీలక సమన్వయం నెరిపారని భావిస్తున్న ముండే పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితిని సమీక్షించేందుకు శరద్‌ పవార్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యక్షం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు అసెంబ్లీ తనకు తగిన సంఖ్యాబలం ఉందని దేవేంద్ర ఫడ్నవీస్‌ గవర్నర్‌కు రాసిన లేఖతో పాటు ఫడ్నవీస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్‌ రాసిన లేఖలను తమకు సమర్పించాలని గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ సుప్రీం కోర్టు కోరింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top