తండ్రికి వ్యతిరేకంగా కూతురు పోటీ

Daughter And Son in law To Contest Against To Ram Vilas Paswan - Sakshi

పాట్నా : ‘కన్న కూతురికి న్యాయం చేయలేని వాడు సమాజానికి ఏం న్యాయం చేస్తాడు. కూతుర్ని పట్టించుకోని వ్యక్తి బేటీ బచావో.. బేటీ పడావో అంటూ నినదాలు చేయడం హాస్యాస్పదంగా ఉందం’టూ కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌పై ఆయన అల్లుడు అనిల్‌ సాధు మండిపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను, తన భార్య ఆశా దేవి, రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌కు,ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌కు వ్యతిరేకంగా పోటి చేయనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా అనిల్‌ సాధు మాట్లాడుతూ.. సొంత కూతురికి న్యాయం చేయలేని వ్యక్తి సమాజంలోని ఆడవారిని ఎలా ఉద్దరిస్తారని ప్రశ్నించారు. రామ్‌ విలాస్‌, పాశ్వన్‌ సామాజిక వర్గాన్ని దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. అంతేకాక కన్న కూతురికి న్యాయం చేయలేని వ్యక్తి ‘బేటీ బచావో..బేటీ పడావో’ అంటూ నినదించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  రామ​ విలాస్‌ తన కుమార్తె కన్నా కొడుకు పట్లనే అధిక ప్రేమ చూపేవాడని తెలిపారు. అందుకే ఆయన తన కుమారుడు చిరాగ్‌ని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపాడు.. కానీ కూతుర్ని మాత్రం గ్రామంలోనే ఉంచాడని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంటూ నినదిస్తున్నారు. కానీ జనాలు ఆయన మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరని తెలిపాడు.

అంతేకాక రానున్న 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన భార్య ఆశా దేవి, రామ్‌ విలాస్‌ పాశ్వన్‌ మీద.. తాను రామ్‌ విలాస్‌ కొడుకు చిరాగ్‌ పాశ్వాన్‌ మీద పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిల్‌ సాధు ప్రకటించారు. రాష్ట్రీయా జనతా దళ్‌ పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒక వేళ తమకు టికెట్‌ ఇవ్వకపోయినా రామ్‌ విలాస్‌కు, అతని కొడుకుకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు. 2019 ఎన్నికల్లో రామ్‌ విలాస్‌ను ఆయన కుమారుడిని ఓడించడమే తన లక్ష్యంగా అనిల్‌ సాధు పేర్కొన్నారు.

ఆశా దేవి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మొదటి భార్య రాజ్‌ కుమారి దేవి కూతురు. కానీ రామ్‌ విలాస్‌ ఆశా తల్లికి విడాకులు ఇచ్చి 1983లో రీనా అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. చిరాగ్‌, రామ్‌ విలాస్‌ - రీనాల కుమారుడు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top