జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించిన సీపీఐ, జనసేన

CPI Chada Venkat Reddy Slams KCR Over Illegal Buildings - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  అ‍క్రమ కట్టడాల నిర్మూలనలో జీహెచ్‌ఎంసీ విఫలమైందని ఆరోపిస్తూ.. సీపీఐ, కాంగ్రెస్‌, టీడీపీ, జనసమితి అధ్యర్యంలో శనివారం జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. అక్రమ కట్టడాల నిర్మూలన విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దూసుకుపోతుంటే.. కేసీఆర్‌ మాత్రం నిద్ర పోతున్నారని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో 800 వరకూ చెరువులుండేవన్నారు. ప్రస్తుతం అవన్ని కబ్జాకు గురయ్యయన్నారు. జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కొమ్ముకాస్తూ జనాలకు నరకం చూపిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. చెరువుల పరిరక్షణ కోసం అన్ని పార్టీలతో కలిసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top