కాంగ్రెస్‌ నేతలకు బీజేడీ తీర్థం

Congress Leaders Join In BJD - Sakshi

పర్లాకిమిడి : భువనేశ్వర్‌లోని నవీన్‌ పట్నాయక్‌ నివాసంలో జరిగిన ‘మిశ్రణ పర్వ్‌’ కార్యక్రమంలో భాగంగా గజపతి జిల్లా నుంచి వందలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు, సర్పంచ్‌లు, సమితి సభ్యులు, వార్డు మెంబర్లు ముఖ్యమంత్రి సమక్షంలో బీజేడీ పార్టీలో చేరినట్టు మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గజపతి జిల్లాలోని కాశీనగర్, గుసాని సమితులకు చెందిన కాంగ్రెస్‌ నేతలు బీజేడీలో చేరుతున్నారని తెలిపారు.

దీంతో పర్లాకిమిడి నియోజకవర్గంలో బీజేడీ పార్టీ మరింత బలోపేతం అయిందన్నారు. మిశ్రణ పర్వ్‌లో జిల్లా బీజేడీ పరిశీలకుడు గోపాల్‌పూర్‌ ఎమ్మెల్మే డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ పాణిగ్రాహి, బరంపురం ఎంపీ సిద్ధాంత మహాపాత్రో, కేంద్ర మాజీ మంత్రి చంద్రశేఖర సాహు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top