రెండు రోజుల్లో పూర్తి జాబితా: కుంతియా | Congress Full list in two days: Kuntia | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో పూర్తి జాబితా: కుంతియా

Nov 14 2018 3:41 AM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Full list in two days: Kuntia - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రెండు రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల పూర్తి జాబి తాను విడుదల చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్‌సి.కుంతియా వెల్లడించారు. ఇప్పటికే ప్రకటించిన తొలి జాబితాలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశామన్నారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు జరుగుతోందని, రెండు రోజుల్లో జాబితా విడుదల చేస్తామని తెలిపారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ టికెట్లు దక్కని వారు అసంతృప్తికి లోను కావద్దని, టికెట్లు దక్కని నేతలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌కు ఆయుధంలా మారింది: పొన్నాల
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడం టీఆర్‌ఎస్‌కు ఆయుధం లా మారిందని మాజీ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ఒక సామాజిక వర్గాన్ని దూరం పెట్టిం దని ప్రచారం చేసుకునే అవకాశం టీఆర్‌ఎస్‌కు కలిగిందన్నారు.

మంగళవారం ఢిల్లీ చేరుకున్న పొన్నాల.. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని ఆమె నివాసంలో కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలి జాబితాలో తన పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. తాను టికెట్‌ కోరిన తర్వాత కాంగ్రెస్‌ ఇవ్వకపోవడం ఉండదన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement