మధ్యప్రదేశ్‌లో మేజిక్‌ మార్క్‌ చేరుకున్న కాంగ్రెస్‌

Congress Emerges Single Largest Partty In Madhya Pradesh - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డ బీజేపీ, కాంగ్రెస్‌లు తుది రౌండ్ల వరకూ ఉత్కంఠ పెంచేలా పోటీపడుతున్నాయి. ప్రారంభం నుంచీ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య స్వల్ప ఆధిక్యంతో విజయం దోబూచులాడుతున్నా తాజాగా కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ ఫిగర్‌ 116 స్ధానాలు కాగా, కాంగ్రెస్‌ 115 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 105 స్ధానాల్లో ఆధిక్యం సాధించింది.

ఇక నాలుగు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్న బీఎస్పీ, ఆరు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్న ఇతరులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనున్నాయి. ఫలితాల సరళిని పరిశీలిస్తే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఎస్పీ, ఇతరుల సహకారంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహలు చేస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top