హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ యూనిట్‌ రద్దు

Congress Dissolves State Unit But Retains Chief Position In Himachal Pradesh - Sakshi

న్యూఢిల్లీ : హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ తన పార్టీకి సంబంధించిన యూనిట్‌ను రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ సీనీయర్‌ నాయకుడు కె.సి. వేణుగోపాల్ బుధవారం పేర్కొన్నారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కుల్దీప్‌ సింగ్‌ రాథోర్‌ మాత్రం పదవిలో కొనసాగుతారని స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. 'హిమాచల్‌ప్రదేశ్‌లో పీసీసీ ,డీసీసీ, బీసీసీ ఎగ్జిక్యూటివ్‌ పదవులతో పాటు ఆఫీస్‌ బేరర్లను తొలగిస్తున్నాం. అయితే హెచ్‌సీసీ పదవి మాత్రం యధాతథంగా కొనసాగుతుందని' వేణుగోపాల్‌ పేర్కొన్నారు. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్ర అధ్యక్ష పదవికి కుల్దీప్‌ సింగ్‌ రాథోర్‌ జనవరిలో నియమితులయ్యారు. గతంలో కూడా గుజరాత్‌, కర్నాటకలోనూ ఇదే తరహాలో కాంగ్రెస్‌ తన యూనిట్‌లను రద్దు చేసి పీసీసీ పదవుల్ని మాత్రం అలాగే కొనసాగించింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top