దిగ్విజయ్‌కు కంప్యూటర్‌ బాబా మద్దతు | Computer Baba Supports Digvijay Singh | Sakshi
Sakshi News home page

దిగ్విజయ్‌కు కంప్యూటర్‌ బాబా మద్దతు

May 8 2019 4:18 AM | Updated on May 8 2019 4:30 AM

Computer Baba Supports Digvijay Singh - Sakshi

భోపాల్‌: భోపాల్‌ లోక్‌సభ స్థానానికి పోటీచేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి దిగ్విజయ్‌సింగ్‌ విజయాన్ని కాంక్షిస్తూ వందలాది మంది సాధువులు మంగళవారం భోపాల్‌ చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. కంప్యూటర్‌ బాబాగా పేరుపొందిన సాధూ నామ్‌దేవ్‌ త్యాగి ఆధ్వర్యంలో వారు మంగళవారం ఆసనాలు వేస్తూ ప్రచారం నిర్వహించారు. కంప్యూటర్‌ బాబాకు అప్పటి బీజేపీ ప్రభుత్వం నర్మదా పరిశుభ్రత ప్యానెల్‌లో సహాయ మంత్రి హోదా కట్టబెట్టింది.  అయితే, ఆయన ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వపనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement