
సాక్షి, హైదరాబాద్: దేశభక్తి ఉన్మాదం, కార్పొరేట్ సహకారం, హిందుత్వ ప్రచారపు పరాకాష్టతో బీజేపీ మరోసారి గెలుపొందిందని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న ఒక ప్రకటనలో విమర్శించారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాల నిర్వహణ, ఐక్యంగా ప్రతిఘటించడంలోనూ ప్రతిపక్షాలు విఫలం అయ్యాయని పేర్కొన్నారు.
2014 మేనిఫెస్టో అమల్లో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. విపక్షాల ఓట్లను లక్షల సంఖ్యలో తొలగించడం వంటి వ్యవహారాలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్‌ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం సగం స్థానాలే సాధించిందని చంద్రన్న వివరించారు.