'కేసీఆర్‌ది ఈవెంట్స్‌ ప్రభుత్వం' | bjp leader kishan reddy slams trs government | Sakshi
Sakshi News home page

'కేసీఆర్‌ది ఈవెంట్స్‌ ప్రభుత్వం'

Feb 13 2018 2:05 PM | Updated on Feb 13 2018 2:05 PM

bjp leader kishan reddy slams trs government - Sakshi

కిషన్‌ రెడ్డి

తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ఈవెంట్స్‌ ప్రభుత్వంగా మారిందని బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్‌ రెడ్డి విమర్శించారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ఈవెంట్స్‌ ప్రభుత్వంగా మారిందని బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రగతి భవన్‌ను టీఆర్‌ఎస్‌ కార్యాలయంగా మార్చేశారన్నారు.

కేంద్ర నిధులను వాడుకుని బీజేపీని విమర్శించడం సరికాదని తెలిపారు. 2 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేస్తే ఇప్పటికి ఎన్ని నిర్మించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర నిధులను దారిమళ్లించి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement