వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: సీఎం

Bihar CM Nitish Kumar Says No Compromise In Prohibition Law - Sakshi

పట్నా: మద్యనిషేద చట్టాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నరన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చట్టంలో కొన్నిసవరణలు చేయనున్నామని పేర్కొన్నారు. ‘ఇంటర్నేషనల్‌ డే అగైనెస్ట్‌ డ్రగ్‌ అబ్యూజ్‌ అండ్‌ ఇల్లిసిట్‌ ట్రాఫికింగ్‌’ సందర్భంగా మంగళవారం పట్నాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మద్యనిషేధ చట్టాన్ని దుర్వినియోగం కాకుండా చట్టంలో మరిన్ని సవరణలు చేయనున్నామని తెలిపారు.

‘మద్య నిషేధం వల్ల ప్రభుత్వం ఏడాదికి 5000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతుందని, అయినప్పకి ప్రజల క్షేమం కోసం నిషేధ చట్టాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మద్యనిషేధ నిర్ణయంతో రాష్ట్రంలోని పలు గ్రామాల స్వరూపం మారిపోయిందన్నారు. ‘ఈ చట్టాన్ని తేవడం వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుందని కొంతమంది నాకు సూచించారు అయినప్పకి నేను తగ్గలేదు. నిషేధం తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారు. నిషేధనంతరం ప్రభుత్వానికి వివిధ రూపాల్లో రూ.10,000 అధిక ఆదాయం సమకూరుంది. ఇది ప్రభుత్వం, ప్రజలు సాధించిన విజయమ’ని నితీష్‌ పేర్కొన్నారు.

కాగా, నిషేధం కారణంగా మరణించిన వారి గురించి మాట్లాడుతూ.. వారు మందుకు బానిసలై చనిపోయాన్నారు. రోజూ మద్యం సేవించడం వల్ల వారి ఊపరితిత్తులు, కిడ్నీలు పాడై చనిపోయారన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు మద్యానికి దూరమైన తర్వాత గ్రామాలు అభివృద్ధి దిశగా సాగుతున్నాయన్నారు. మద్యానికి పెట్టే డబ్బులను ఇతర మార్గాలలో ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు.

మద్యనిషేధ చట్టాన్ని కొంతమంది దుర్వినియోగపరుస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. హోం శాఖ, ఎక్సైజ్‌ శాఖ అధికారులు సూచనల మేరకు చట్టంలో కొన్ని మార్పులు చేయనున్నామని తెలిపారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని సవరణలు చేసి మద్యనిషేధ చట్టాన్ని కొనసాగిస్తామన్నారు.

ఏప్రిల్ 2016 నుంచి రాష్ట్రంలో మద్య నిషేధం అమలులో ఉండగా, ఆపై ఏడాది పాటు మత్తుకు బానిసలైన వారు తీవ్ర ఇబ్బందులు, మానసిక రుగ్మతలతో బాధపడినా, ఆపై మారారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలు మద్యానికి దూరమైన తరువాత అభివృద్ధి దిశగా సాగుతున్నారు. మద్యానికి పెట్టే డబ్బును ఇతర మార్గాల్లో ఖర్చు చేస్తున్నారు. పాలు, మజ్జిగ, పెరుగు వంటి అమ్మకాలు సైతం గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top