భారీ మెజార్టీతో గెలిపించండి: మంత్రి బొత్స | Beware Of Chandrababu and Yellow medai, says Botsa | Sakshi
Sakshi News home page

బాబు, ఎల్లో మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి..

Jan 12 2020 3:32 PM | Updated on Jan 12 2020 7:41 PM

Beware Of Chandrababu and Yellow medai, says Botsa - Sakshi

సాక్షి, అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయని, అన్ని స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ‍్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను నిక్కచ్చిగా అమలు చేస్తున్న ఘటన సీఎం జగన్‌దేనని అన్నారు. అమ్మ ఒడి కింద రూ.6,400 కోట్లు విడుదల చేశారన్నారు.

అమరావతిలో చంద్రబాబు, టీడీపీ నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారని.. తప్పులు కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చంద్రబాబు కారణమని.. బినామీ ఆస్తులు కాపాడుకునేందుకు అమరావతి ఉద్యమం చేస్తున్నారని విమర్శించారు. ఏపీ లోని 13 జిల్లాల అభివృద్ధికి వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏపీకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను దిగ్విజయంగా ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. భావితరాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు.

ఈనాడు, ఆంధ్రజ్యోతి దిన పత్రికలు, ఛానల్స్‌ ప్రభుత్వంపై విషం కక్కుతున్నాయని బొత్స విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఎల్లో మీడియా అవాస్తవాలు రాస్తోందని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. అమరావతిలో బినామీ ఆస్తుల కోసమే చంద్రబాబు ఆరాటం, పోరాటమని ఎద్దేవా చేశారు. ప్రజలు చంద్రబాబు ఉచ్చులో పడవద్దని సూచించారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణతో ఏపీ బాగుపడుతుందని మంత్రి బొత్స తెలిపారు.

చదవండి:

ఇదీ భ్రమరావతి కథ

రాజధానికి దూరమైనా.. అభివృద్ధికి దగ్గరే

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా’..

గ్రీన్జోన్ పేరుతో చంద్రబాబు మోసం చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement