చంద్రబాబు సంస్కారహీనుడు

AP Minister Mopidevi Venkata Ramana Fires On Chandrababu - Sakshi

మంత్రి మోపిదేవి వెంకటరమణ 

సాక్షి, అమరావతి: సభ్య సమాజం తలదించుకునేలా ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడుతున్నారని మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడి.. చంద్రబాబు స్థాయిని దిగజార్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు సంస్కారహీనుడు కాబట్టే లోకేష్‌ మతిలేని వ్యక్తిగా మారిపోయాడని’ మంత్రి మోపిదేవి వ్యాఖ్యానించారు. అందుకే మంగళగిరి ప్రజలు కూడా లోకేశ్‌ను ఓడించి ఇంటికి పంపారని ఎద్దేవా చేశారు. టీడీపీ సమీక్షల్లో చంద్రబాబు అసందర్భ ప్రేలాపణలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.

దళారీ వ్యవస్థను అరికట్టాం..
రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం అని మంత్రి మోపిదేవి అన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రూ.3వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని తెలిపారు. శనగరైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మార్కెట్‌ యార్డుల్లో దళారీ వ్యవస్థను అరికట్టామని మంత్రి మోపిదేవి చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top