చంద్రబాబు కుటుంబంలోనే దొంగలు ఉన్నారు: ఎంపీ మోపిదేవి | Ysrcp Mp Mopidevi Venkata Ramana Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కుటుంబంలోనే దొంగలు ఉన్నారు: ఎంపీ మోపిదేవి

Oct 15 2023 8:32 PM | Updated on Oct 15 2023 8:38 PM

Ysrcp Mp Mopidevi Venkata Ramana Comments On Chandrababu - Sakshi

ఫైల్‌ఫోటో

చంద్రబాబుకు హాని చేయాల్సిన పని ప్రభుత్వానికి లేదని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు.

సాక్షి, బాపట్ల: చంద్రబాబుకు హాని చేయాల్సిన పని ప్రభుత్వానికి లేదని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. బాబుకు ప్రమాదం ఏదైనా ఉంటే అది కుటుంబ సభ్యుల నుంచే ఉంటుందని, చంద్రబాబు కుటుంబంలోనే దొంగలు ఉన్నారన్నారు. చంద్రబాబు చుట్టూ దొంగలను పెట్టుకొని ప్రభుత్వంపై బురద చల్లటం సరైన పద్దతి కాదంటూ ఎంపీ మోపిదేవి హితవు పలికారు.

‘‘13 చోట్ల సంతకాలు పెట్టి సీఐడీకి అడ్డంగా దొరికిన దొంగ బాబు. బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మానసికంగా కుంగిపోయి బరువు తగ్గుతారు. కానీ చంద్రబాబు జైలులో ఉండి కూడా కేజీ బరువు పెరిగారు. జైల్లో ఉండి కూడా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబు జైలు జీవితం గడుపుతున్నాడు. గతంలో స్టేలతో తప్పించుకుని తిరిగిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబు పాపం పండింది జైలుకి వెళ్లారు’’ అని మోపిదేవి వ్యాఖ్యానించారు.
చదవండి: నారా లోకేష్‌కి మరోసారి షాక్‌ ఇచ్చిన ప్రజలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement