ఆ 19 పార్టీలకే పార్టీ గుర్తులు

AP Election Commission Gazette Notification on allocation of election symbols in local body elections - Sakshi

స్థానిక ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌

సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల్లో వివిధ పార్టీల తరుఫున పోటీ చేసే వారికి గుర్తుల కేటాయింపుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 19 రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే వారికి ఆయా రాజకీయ పార్టీల గుర్తులు కేటాయించనున్నట్టు ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.  
- గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీలతో పాటు రాష్ట్ర స్థాయిలో వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం, ఇతర రాష్ట్రాలకు  చెందిన టీఆర్‌ఎస్, అన్నాడీఎంకే, ఫార్వర్డ్‌బ్లాక్, ఎంఐఎం, ఐయూఎంఎల్, జనతాదళ్‌–ఎస్, జనతాదళ్‌–యూ, సమాజ్‌వాదీ పార్టీ (మర్రిచెట్టు గుర్తు), ఆర్‌ఎల్‌డీ, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఉన్నాయి. వీటి తరఫున పోటీ చేసే వారికి ఆయా పార్టీల గుర్తులు కేటాయిస్తారు.  
రిజస్టర్డ్‌ పార్టీలలో జనసేన పార్టీకి ప్రత్యేకంగా గుర్తును రిజర్వు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద మరో 89 రాజకీయ పార్టీలు రిజిస్టర్‌ చేసుకున్నా వాటికి గుర్తులు కేటాయించలేదు.  
- స్వతంత్ర అభ్యర్ధులుగా, గుర్తు కేటాయించని రిజిస్టర్‌ పార్టీల 
తరుఫున పోటీ చేసే వారి కోసం 60 గుర్తులను గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా ఉదహరించారు. 
ఈసారి స్థానిక ఎన్నికల బ్యాలెట్‌ పేపరులో ‘నోటా’ కూడా ఉంటుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top