ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు

Andhra Pradesh Elections 2019 Exit Polls Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుందని వెల్లడించాయి. సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆదివారం సాయంత్రం వెల్లడయ్యాయి. లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయ దుందుభి మోగించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా కట్టాయి. తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీకి అధికార వియోగం తప్పదని తేల్చాయి. పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది.

లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేసింది. టీడీపీ​కి 4 నుంచి 6 సీట్లు రావొచ్చని తెలిపింది.

ఆరా సర్వే ప్రకారం వైఎస్సార్‌సీపీకి 20 నుంచి 24 ఎంపీ సీట్లు రావొచ్చని తెలిపింది. టీడీపీకి 1 నుంచి 5 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.

టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల ప్రకారం వైఎస్సార్‌సీపీకి 18 సీట్లు టీడీపీకి 7 సీట్లు రావొచ్చని అంచనా.

న్యూస్‌ 18- ఐపీఎస్‌ఓఎస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైఎస్సార్‌సీపీకి 13 నుంచి 14 సీట్లు వస్తాయి. టీడీపీ 10 నుంచి 12 సీట్లు దక్కించుకుంటుంది.

మీడియా సంస్థ వైఎస్సార్‌సీపీ టీడీపీ జనసేన
ఇండియా టుడే 18-20 4-6 0-1
న్యూస్‌ 18 13-14 10-12 0
టైమ్స్‌ నౌ 18 7 0
ఆరా 20-24 1-5 0
రిపబ్లికన్‌ టీవీ 13-16 8-12 0

అసెంబ్లీ ఎన్నికల్లో...
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 133 నుంచి 135 వరకు సీట్లు వస్తాయని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌(సీపీఎస్‌) అంచనా వేసింది. టీడీపీకి 37 నుంచి 40 స్థానాలు దక్కే అవకాశముందని పేర్కొంది. జనసేన పార్టీకి ఒక స్థానం రావొచ్చని తెలిపింది.

వైఎస్సార్‌సీపీకి 112, టీడీపీ 59, జనసేనకు 4 అసెంబ్లీ స్థానాలు వస్తాయని పీపుల్స్‌ పల్స్‌ సర్వే వెల్లడించింది. వైఎస్సార్‌సీపీకి 18 నుంచి 21 లోక్‌సభ స్థానాలు గెల్చుకునే అవకాశముందని తెలిపింది. టీడీపీకి 4 నుంచి 6 సీట్లు దక్కనున్నాయని అంచనా కట్టింది. జనసేనకు ఒక స్థానం రావొచ్చని తేల్చింది.

ఆరా సర్వేలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 126 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. టీడీపీ 47, జనసేన పార్టీకి 2 స్థానాలు వచ్చే అవకాశముందని వెల్లడించింది.

వీడీపీ అసోసియేట్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైఎస్సార్‌సీపీకి 111 నుంచి 121 సీట్లు వస్తాయి. టీడీపీకి 54 నుంచి 64 స్థానాలు దక్కుతాయి. జనసేనకు 4 సీట్లు వచ్చే అవకాశముంది.

ఐపల్స్‌ సర్వే ప్రకారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 110 - 120, టీడీపీకి 56 - 62, జనసేన పార్టీ 0 - 3 స్థానాలలో విజయం సాధిస్తాయి.

► కేకే సర్వే ప్రకారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 130 - 135, టీడీపీ 30 - 35, జనసేన పార్టీ 10 - 13 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి

►  మిషన్‌ చాణక్య సర్వే ప్రకారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 98 స్థానాల్లో, టీడీపీ 58 స్థానాల్లో, జనసేన పార్టీ 7 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధిస్తారని అంచనా వేశారు.

సర్వే సంస్థ వైఎస్సార్‌సీపీ టీడీపీ జనసేన
సీపీఎస్‌ 133-135 37-40 0-1
ఆరా 126 47 2
కేకే  130 - 135 30 - 35 10-13 
వీడీపీ 111-121 54-64 0-4
ఐపల్స్‌ 110 - 120 56 - 62 0 - 3
మిషన్‌ చాణక్య 98 58 7

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
వైఎస్‍ఆర్‌సీపీ ప్రభంజనం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top