
ఎంపీ పండుల రవీంద్రబాబు(పాత చిత్రం)
కాకినాడ: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ‘ జూలకటక’ అన్నట్లుగా తయారయ్యాడని అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర బాబు ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పండుల రవీంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ ఎన్నికల ఫలితాల సర్వేతో జోకర్ అయ్యాడని అన్నారు. లగడపాటి తన వ్యాపారాల్లో కాళ్లు ఎత్తేశాడని ఆరోపించారు. బ్యాంక్ అప్పులు తీర్చుకోవడానికి బెట్టింగ్ వ్యాపారం మొదలు పెట్టారని విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత లగడపాటి ఎలాగూ పారిపోతాడని జోస్యం చెప్పారు. ఎందుకంటే అతని సర్వే నమ్మి బెట్టింగ్ కాసిన వాళ్లు వెంటపడతారని అన్నారు.