ఏపీ భవన్‌కు రాహుల్‌.. ‘భోజన్‌ పే చర్చ’ | AICC President Rahul Gandhi Reaches AP Bhavan | Sakshi
Sakshi News home page

ఏపీ భవన్‌కు రాహుల్‌.. ‘భోజన్‌ పే చర్చ’

Feb 19 2019 3:14 PM | Updated on Mar 28 2019 5:23 PM

AICC President Rahul Gandhi Reaches AP Bhavan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పనలో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం హస్తినలోని ఏపీ భవన్‌కు వచ్చారు. ఏపీ భవన్‌లో ఆయనకు టీడీపీ సీనియర్‌ నేత, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు సాదర స్వాగతం పలికారు. పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పనలో భాగంగా ‘అప్నే బాత్‌-రాహుల్‌కే సాత్‌’ పేరిట రాహుల్‌గాంధీ ఏడుగురు చిన్న వ్యాపారులతో ‘భోజన్‌ పే చర్చ’ నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పనలో భాగంగా వివిధ వర్గాల అభిప్రాయాలను రాహుల్‌ ‘భోజన్‌ పే చర్చ’లో తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ యంత్రాంగం వీడియో షూట్‌ చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement