పార్టీ కోరితే పోటీకి సిద్ధం: కృష్ణంరాజు | Again Modi Electes As Prime Minister Says Krishnam Raju | Sakshi
Sakshi News home page

పార్టీ కోరితే పోటీకి సిద్ధం: కృష్ణంరాజు

Mar 11 2019 10:33 AM | Updated on Mar 11 2019 10:41 AM

Again Modi Electes As Prime Minister Says Krishnam Raju - Sakshi

సాక్షి, తిరుపతి: బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు స్పష్టంచేశారు. సోమవారం తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నికవ్వడం ఖాయమని అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ బలంగా ఉందని, గత ఎన్నికల ఫలితాలే మరోసారి పునారావృత్తం అవుతాయని కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. గతంలో ఆయన నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన విషయం తెలిసిందే. కాగా పోటీ సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే పలుమార్లు ఆయన ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement