కొన్నేళ్ల క్రితం జార్జి బుష్ మీద బూటు విసిరినందుకు ఒక వ్యక్తిని చాలా సంస్థలు సన్మానించాయి.
కొన్నేళ్ల క్రితం జార్జి బుష్ మీద బూటు విసిరినందుకు ఒక వ్యక్తిని చాలా సంస్థలు సన్మానించాయి. ఇలాంటి వినూత్న పంథాలో మేమూ ప్రయాణించగలం అన్నట్టు పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌లోని ఒక వర్గం రెండు రోజుల క్రితం అపురూప సత్కారం ఒకటి చేసింది. 55 ఏళ్ల జర్నైల్ సింగ్ ఆ అదృష్టానికి నోచుకున్నాడు. నవంబర్ 20న జర్నైల్‌సింగ్ పంజాబ్ వ్యవసాయ మంత్రి సికిందర్ సింగ్ మాలుకాను హమీర్‌గఢ్ అనే గ్రామంలో లాగి లెంపకాయ కొట్టాడు.
కారణం ఏమిటి? మతాన్ని అవమానిస్తున్న వారి పట్ల ఆ మంత్రి కఠినంగా వ్యవహరించడం లేదట! జర్నైల్ దెబ్బకి మంత్రి తలపాగా కూడా పడిపోయింది. తరువాత మంత్రిగారి అభిమానులు జర్నైల్‌ను చావగొట్టి, ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కేసు పెట్టారు. అకాలీదళ్ (బాదల్) వర్గం మతాన్ని రాజకీయాల కోసం భ్రష్టుపట్టిస్తున్నదని జర్నైల్ అంటున్నాడు. ఏమైనా, మంత్రులంతా జాగ్రత్తగా ఉండాలి.