తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుండి పార్టీకి ఉద్యమానికి అండదండగా ఉంటూ వచ్చిన..
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుండి పార్టీకి ఉద్యమానికి అండదండగా ఉంటూ వచ్చిన ప్రైవేటు స్కూళ్లు, ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులను యాజమాన్యాలను చిన్నచూపు చూడడం ప్రభుత్వానికి సమంజసం కాదు. చదువుకున్న వారు ఉద్యోగాలు రాక ఉపా ధి కోసం విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని భార్యాబిడ్డలను పోషించుకుంటూ తోటి వారికి ఉపాధి కల్పిస్తున్నారు.
అలాంటి విద్యా సంస్థలపై చిన్నచూపు తగునా? దాదాపు 80% విద్యా ర్థులు ప్రైవేటు విద్యాసంస్థల్లోనే చదువుతున్నా రు. అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూనే మంచి నాణ్యమైన విద్యనందిస్తున్నాం. రాష్ట్రంలో ఒకటి రెండు కార్పొరేట్ కళాశాలలను, స్కూళ్లను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలోని అన్ని ప్రైవే టు విద్యాసంస్థలను ఒకే గాటిపై కట్టి చూడడం న్యాయంకాదు. ప్రభుత్వం దయతో ప్రైవేటు విద్యాసంస్థలను కాపాడాలని కోరుతున్నాం.
- రమేశ్, కార్యదర్శి,
తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల పరిరక్షణ సంఘం, కరీంనగర్