అమెరికాలో రోడ్డు ప్రమాదం, తెలుగు విద్యార్థి మృతి | Two Indian Students Killed In US Road Accident | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారతీయ విద్యార్థుల మృతి

Dec 2 2019 10:39 AM | Updated on Dec 2 2019 11:22 AM

Two Indian Students Killed In US Road Accident - Sakshi

మృతులు వైభవ్‌ గోపిశెట్టి, జుడీ స్టాన్లీ

టెనెస్సీ: అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారతీయ విద్యార్థులు జుడీ స్టాన్లీ(23), వైభవ్‌ గోపిశెట్టి(26) టెనెస్సీ స్టేట్‌ యూనివర్సిటీ(టీఎస్‌యూ)లో ఫుడ్‌ సైన్స్‌ కోర్సు చదువుతున్నారు. వీరిద్దరూ నవంబర్‌ 28న జరిగిన ఓ పార్టీ నుంచి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలో వేగంగా వస్తున్న ట్రక్కు వీరి కారును ఢీ కొట్టడంతో టెనెస్సీ వద్ద ఘోర ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో విద్యార్థులిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో ట్రక్కు డ్రైవర్‌ డేవిడ్‌ టారెస్‌ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. కాగా మృతుల్లో ఒకరైన వైభవ్‌ గోపిశెట్టి విజయవాడకు చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. భారతీయ విద్యార్థులు మృతి చెందిన ఘటనపై టెనెస్సీ యూనివర్సిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. స్వదేశంలో జరిగే వీరి అంత్యక్రియల కోసం యూనివర్సిటీ విద్యార్థులు ‘గో ఫండ్‌ మీ పేజ్‌’ను ఏర్పాటు చేసి 42వేల డాలర్లు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement